కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్‌కు ఊపు: భూసేకరణ నిమిత్తం రూ.100 కోట్లు విడుదల
రిపోర్టర్: గోపి
స్థలం: Konaseema
కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ నిర్మాణ ప్రాజెక్ట్‌లో భాగంగా భూసేకరణకు రూ.100 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని ఆర్అండ్బీ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద ప్రత్యేక సాయం నిధులను ఈ ప్రాజెక్ట్ కోసం వినియోగించాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిధులు అమలాపురం ఆర్డీవోకి బదలాయించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రభుత్వ నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ పనులు ఇక శరవేగంగా సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.