పులివెందులలో ఉద్రిక్తత: నామినేషన్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల ఘర్షణ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Pulivendula
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా వైఎస్సార్సీపీ మరియు టీడీపీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణతో పులివెందులలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని పోలీసులు తెలిపారు. ఇరువర్గాలు ఒకేసారి నామినేషన్లకు రావడంతో ఉద్రిక్తత తలెత్తిందని, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ ప్రయోగించారని వివరించారు. పోలీసులపైకి కార్యకర్తలు దూసుకెళ్లడంతో గత్యంతరం లేక ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.