మంగంపేటలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన కూటమి శ్రేణులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఓబులవారిపల్లి
ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి యనమల ఉమాదేవిని గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని టీడీపీ సీనియర్ నాయకుడు అనుములగుండం చంద్రమోహన్ గడపగడపకు తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని నాయకులు హామీ ఇస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.