దేవునిగూడెంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

రిపోర్టర్: Gone Rachana స్థలం: దస్తురాబాద్

దస్తూరాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచి ఎండపల్లి గంగన్న, ఆర్ ఐ సాయికిరణ్ ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వంశీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పంపిణీ ప్రక్రియ ద్వారా లబ్ధిదారులకు రేషన్ సరుకులు మరింత సులభంగా అందనున్నాయని అధికారులు తెలిపారు.