కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు బోల్తా, డ్రైవర్ మృతి
రిపోర్టర్: అశోక్
స్థలం: కామారెడ్డి
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ సమీపంలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను బిచ్కుంద ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.