ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో కీలక సవరణలు

రిపోర్టర్: గోపి స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖలోని ఉద్యోగ నిబంధనలకు సంబంధించి కీలక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ రూల్స్-1993లో ప్రధాన సవరణలు చేపట్టింది. ఆర్టీఓ, మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ నుంచి ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుళ్ల వరకు అన్ని కేడర్లను స్థానిక కేడర్లుగా మారుస్తూ నియామక యూనిట్లను ఖరారు చేసింది. రవాణా శాఖలో ప్రత్యక్ష నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ వర్తించనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.