ఘనంగా ప్రారంభమైన సైమా 2026 అవార్డుల వేడుకలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Karnataka

బెంగళూరు వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌ 2026 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన తారలు సందడి చేశారు. మిరాయ్ చిత్రానికి తేజ సజ్జా ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకోగా, సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి గాను ఐశ్వర్య రాజేశ్ ఉత్తమ నటి క్రిటిక్స్ పురస్కారాన్ని అందుకున్నారు. రమణ గోగుల, సమీరా భరద్వాజ్ తదితరులు అవార్డులు గెలుచుకున్నారు.