ఆదోనిలో భక్తిశ్రద్ధలతో ఘనంగా జైనుల శోభాయాత్ర
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆదోని
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జైనులు 30 రోజుల ఉపవాస దీక్షల అనంతరం భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. బంగారు బజార్లోని వాసుపూజ్య మందిరం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో 12 వెండి రథాలను పుర వీధుల మీదుగా తిప్పారు. సంప్రదాయ దుస్తులు ధరించి భజనలు చేస్తూ సాగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, జైన సంఘం పెద్దలు పాల్గొన్నారు.