టీడీపీ సభ్యత్వానికి మరియు పదవులకు వూక విజయ్ కుమార్ రాజీనామా

రిపోర్టర్: హరి స్థలం: తిరుపతి

స్థానిక సంస్థల ఎన్నికల వేళ తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీలో తీవ్ర రాజకీయం వేడెక్కింది. టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీయూఎఫ్ఐడీసీ డైరెక్టర్ వూక విజయ్ కుమార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన పదవులకు రాజీనామా చేశారు. తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను జేబీ శ్రీనివాస్కు అప్పగించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు పంపినట్లు ఆయన వెల్లడించారు.