స్థానిక సంస్థల ఎన్నికలంటే జగన్కు భయం: చింతకాయల విజయ్
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయనగరం
స్థానిక సంస్థల ఎన్నికలంటే వైకాపా అధినేత జగన్ భయపడుతున్నారని రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ ఎద్దేవా చేశారు. విజయనగరంలో నిర్వహించిన కూటమి సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గూండాయిజంతో స్థానిక ఎన్నికలను అణగదొక్కాలని చూసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వంలో కూటమి అభ్యర్థులందరూ ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.