పండ్లపై స్టిక్కర్లు ఉంటే హెచ్చరిక: తింటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోండి

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

పండ్లపై అంటించే చిన్న స్టిక్కర్ల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని భారత ఆహార భద్రత ప్రమాపాల ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది. స్టిక్కర్ల కోసం ఉపయోగించే జిగురు అవశేషాలు ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. కేవలం కడిగి తినడం కాకుండా, స్టిక్కర్ ఉన్న భాగాన్ని కత్తిరించి లేదా తొక్క తొలగించి తీసుకోవాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక సూచనలు చేసింది.