ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన విధుల్లో ఉన్న ఎస్ఐ దుర్మరణం
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ కే. వెంకన్న రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారని పోలీసులు ధ్రువీకరించారు. కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఆయన, డిప్యుటేషన్‌పై నగరానికి వచ్చారు. ప్రమాదం అనంతరం ఆపకుండా పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.