వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడిని తీవ్రంగా ఖండించిన నేతలు

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయనగరం

కూటమి పాలనలో ప్రశ్నించే గొంతుకలపై దాడి చేయడమే ప్రజాస్వామ్యమా అని నేతలు మండిపడ్డారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కుంభకోణంపై విజయవాడ శాప్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వైయస్సార్‌సీపీ నాయకులపై పోలీసుల ముందే పచ్చ గూండాలు దాడి చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.