హమిల్టన్ వేదికగా భారత్ కివీస్ ఆఖరి పోరు: టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

రిపోర్టర్: సురేష్ స్థలం: హమిల్టన్

న్యూజిలాండ్ తో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్ లో టాస్ నెగ్గిన కివీస్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ప్రారంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్ లో పడింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ధాటిగా ఆడి జట్టును ఆదుకున్నారని క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ మ్యాచ్ తో సిరీస్ ను ఘనంగా ముగించాలని టీమ్ఇండియా భావిస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు.