కిర్లంపూడి పరిషత్ పోరులో ప్రలోభాల వరదతో బరితెగించిన నేతలు

రిపోర్టర్: U.Srinivasarao స్థలం: కిర్లంపూడి

కిర్లంపూడి మండలంలో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా భారీగా మద్యం డబ్బు చీరల పంపిణీ సాగింది. ఎన్నికలకు ముందే మద్యం బాటిళ్లను తరలించి విక్రయించారు. ఓట్ల కోసం పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం వెలువడింది. ఈ అక్రమాలు ఎన్నికల అధికారులకు కనిపించకపోవడం గమనించదగిన విషయమని స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.