హైదరాబాద్ జలమండలికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మరియు సీవరేజ్ బోర్డు 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారులకు, ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన తాగునీటి సేవలు అందించడంలో జలమండలి కీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ సీఎంఓ పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం నాణ్యమైన సేవలు అందించేలా అధికారులు మరింత అంకితభావంతో విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.