సినిమా సెట్స్ లో నటీమణులకు వేధింపులు: అనుభవం బయటపెట్టిన రాధికా ఆప్టే
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు, చిత్రబృందం తనను ఇబ్బందికరమైన డిమాండ్లతో వేధించారని నటి రాధికా ఆప్టే ఆవేదన వ్యక్తం చేశారు. తన తాజా వెబ్‌సిరీస్ ప్రమోషన్లలో భాగంగా గతంలో ఎదురైన చేదు అనుభవాలను ఆమె పంచుకున్నారు. బ్రా లేకుండా షర్ట్ బటన్లు విప్పి యాక్షన్ సీన్ లో నటించాలని అడిగారని తెలిపారు. ఒప్పందం చేసుకునేటప్పుడు ఇలాంటి సన్నివేశాల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, షూటింగ్ సమయంలో వేధించడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని పేర్కొన్నారు.