సింహాచలం ఆలయానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు: అప్పన్న కొండకు దక్కిన అరుదైన గుర్తింపు

రిపోర్టర్: కృష్ణ స్థలం: విశాఖపట్నం

మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, భక్తులకు కల్పించిన వసతులకుగాను సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు దక్కిందని ఆలయ ఈవో జె. వెంకట్రావు తెలిపారు. అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆలయ యంత్రాంగం, సిబ్బంది సమష్టి కృషితోనే ఈ అరుదైన గుర్తింపు లభించిందని, ప్లాస్టిక్ నియంత్రణతో పాటు పచ్చదనానికి పెద్దపీట వేశామని ఆయన పేర్కొన్నారు.