గోదావరి కావేరి అనుసంధానంపై చంద్రబాబు విజయ్ కీలక భేటీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Amaravati
గోదావరి కావేరి నదుల అనుసంధాన ప్రక్రియను త్వరగా చేపట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. చెన్నై తాగునీటి అవసరాల కోసం మరో రెండు మూడు టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి నదుల అనుసంధానం ఎంతగానో దోహదపడుతుందని వారు స్పష్టం చేశారు.