రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం, విఫలమైన వ్యక్తంటూ కౌంటర్

రిపోర్టర్: సతీష్ స్థలం: India

నటి రాఖీ సావంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. విజయం సాధించలేక నిరాశతో ఉన్నవారే ఇలాంటి విమర్శలు చేస్తూ క్యారెక్టర్ అసెస్మెంట్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అసూయతోనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, తన విజయానికి సరిసమానంగా రాని వారు తనపై మాట్లాడే అర్హత లేదని కౌంటర్ ఇచ్చారు.