మహబూబ్‌నగర్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల వేడితో రాజకీయ ఉత్కంఠ
రిపోర్టర్: సతీష్
స్థలం: మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ పాలకవర్గ ఎన్నికల నగారా మోగింది. నూతన కమిటీ కోసం 4,728 మంది ఓటర్లు 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు. స్థానిక రాజకీయ నేతల జోక్యంతో ఈ సేవా సంస్థ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. వచ్చే నెల అక్టోబర్ 4న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా, ఓటర్లలో అవగాహన లోపంపై తీవ్ర గందరగోళం వ్యక్తమవుతోంది.