లాలాగూడలో విషాదం: భార్య ఆత్మహత్యతో భర్త కూడా బలవన్మరణం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌ లాలాగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన లక్ష్మి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త శరణప్ప రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. కొద్దిసేపటి వ్యవధిలోనే దంపతులిద్దరూ మృతి చెందడంతో స్థానికంగా శోకసంద్రం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.