మాటల ప్రభుత్వం కాదంటూ ఆనగాని సత్య ప్రసాద్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: బాపట్ల
ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్నామని, తాము చేతల ప్రభుత్వమే తప్ప మాటల ప్రభుత్వం కాదని ఆనగాని సత్య ప్రసాద్ - రెవెన్యూ శాఖ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాము చెప్పినవన్నీ చేసి చూపుతామనే గట్టి నమ్మకం ప్రజల్లో ఉందని ఆయన వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని, భవిష్యత్తులోనూ ఇదే పంథాలో ముందుకు సాగుతామని ఆయన తేల్చిచెప్పారు.