యాదగిరిగుట్టలో భక్తిప్రపత్తులతో కన్నులపండువగా సాగిన లక్ష్మీనరసింహుడి దివ్య గిరిప్రదక్షిణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ శనివారం ఉదయం గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి, సురేష్, సత్తిరెడ్డి, సాయి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిభావాన్ని చాటుకున్నారు.