డక్కిలి మండలంలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థి పిలుపునిచ్చారు

రిపోర్టర్: kummaragunta masthanaiah స్థలం: డక్కిలి

తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో వైకాపా జడ్పిటిసి అభ్యర్థి రాపూర్ మహేష్ వివిధ గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తీర్థంపాడు, దేవుడు వెల్లంపల్లి, నాయుడుపాలెం, దగవోలు గ్రామాల్ లో ప్రతి గడపకూ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.