ఢిల్లీలో కాల్పుల కలకలం: ఇద్దరికి తీవ్ర గాయాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఢిల్లీ
తూర్పు ఢిల్లీలోని కర్కర్‌డూమా ప్రాంతంలో కేఫ్ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 15 రౌండ్లు కాల్పులు జరిపినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారిద్దరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.