కళ్లెం సొసైటీ ఎన్నికల్ లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్: ఎమ్మెల్యే కడియం శ్రీహరికి భారీ షాక్

రిపోర్టర్: కృష్ణ స్థలం: జనగామ

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కళ్లెం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల్ లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని మండల కన్వీనర్ చౌదరపల్లి శేఖర్ తెలిపారు. మొత్తం తొమ్మిది డైరెక్టర్ స్థానాలను గులాబీ పార్టీ కైవసం చేసుకుని క్లీన్స్వీప్ చేయగా, జిల్లెల పాపిరెడ్డి సొసైటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలోనూ ఖాతా తెరవకపోవడంతో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.