డిజిటల్ పేమెంట్స్ మోసం: గూగుల్ పే పేరుతో సూపర్ మార్కెట్ కు టోకరా

రిపోర్టర్: హరి స్థలం: తిరువనంతపురం

గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించామంటూ సూపర్ మార్కెట్ సిబ్బందిని నమ్కించి రెండు లక్షలకు పైగా టోకరా వేసిన పశ్చిమ బెంగాల్ కు చెందిన వలస కార్మికుడిని కేరళలోని విళింజం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మృత్యుంజయ్ పాల్ పలు మార్లు వస్తువులు కొనుగోలు చేసి నకిలీ స్క్రీన్ షాట్లు చూపించి మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని సొంత రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.