ఏపీ పోలీసులకు 4,760 కొత్త వాహనాలు: మంత్రివర్గం కీలక ఆమోదం!

రిపోర్టర్: కృష్ణ స్థలం: Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖకు అత్యంత అధునాతన సౌకర్యాలతో కూడిన 4,760 కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. కాలపరిమితి ముగిసిన పాత వాహనాల స్థానంలో ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.