ఈ నెల 23 రాత్రితో ఖైరతాబాద్ గణేష్ దర్శనాలు సమాప్తం
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు ఈ నెల 23వ తేదీ బుధవారం రాత్రితో ముగియనున్నట్లు ఉత్సవ కమిటీ మరియు పోలీసులు స్పష్టం చేశారు. ఈ నెల 25న శుక్రవారం అత్యంత వైభవంగా జరగనున్న సామూహిక నిమజ్జనోత్సవం నేపథ్యంలో, 24న మండపం షెడ్డు అలాగే బ్యారికేడ్ల తొలగింపు ప్రక్రియను చేపట్టనున్నారు. ఉదయం 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలకల్లా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.