పెండింగ్ ట్రాఫిక్ చలానాల వసూలుకు విద్యుత్ బిల్లుల అనుసంధానం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలానాల జరిమానాలు చెల్లించని వాహనదారులపై సుప్రీంకోర్టు కఠిన చర్యలకు ఆదేశించిందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వందల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉండటంతో, విద్యుత్ బిల్లులతో జత చేసి వీటిని వసూలు చేసే సరికొత్త విధానాన్ని పరిశీలించాలని కోర్టు సూచించింది. బకాయిలు చెల్లించకపోతే ఆర్సీ పునరుద్ధరణ, ఆన్ లైన్ సేవలను నిలిపివేయడంతో పాటు అవసరమైతే వాహనాలను నేరుగా స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు.