రాహుల్ గాంధీ డొల్లతనాన్ని సుప్రీంకోర్టు తీర్పు ఎండగట్టిందన్న హరీష్ రావు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని సుప్రీంకోర్టు తీర్పు ఎండగట్టిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. దానం నాగేందర్ అనర్హత అంశంపై సుప్రీంకోర్టు వెలువరించిన నిర్ణయం, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారంలోని డొల్లతనాన్ని తేటతెల్లం చేసిందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగంపై రాహుల్ గాంధీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే స్పందించాలని హరీష్ రావు సవాల్ విసిరారు.