ఇంజినీరింగ్ విద్యార్థులకు తీపి కబురు: అమెజాన్ స్కాలర్షిప్ దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
పేద ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ సంస్థతో కలిసి ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ ప్రొగ్రామ్ను ప్రకటించిందని అధికారులు తెలిపారు. అర్హులైన తొలి సంవత్సరం విద్యార్థులకు ఏకంగా రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. నవంబర్ ముప్పైవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.