జనసేన నేత దేవినేని యశ్వంత్ జన్మదిన వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చిత్తూరు

చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి దేవినేని యశ్వంత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వినోద్ కుమార్ తో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెంకటేష్, శ్రీనివాస్, కోలా కిరణ్, పూల చందు, ఆకుల గజేంద్ర, ఒ.ఎమ్ రాంధాస్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.