గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్థులు, వాహనాలు స్వాధీనం

రిపోర్టర్: గోపి స్థలం: తిరుపతి

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడులో జరుగుతున్న గ్రావెల్‌ అక్రమ తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతుండటంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రెండు జేసీబీలు, 13 టిప్పర్లను స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు.