యాదగిరిగుట్టలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు.. జయప్రదం చేయాలని పిలుపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తాండూరు
ఈ నెల 8, 9, 10 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జరగనున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని తాండూరు మండల అధ్యక్షురాలు సూరం సాయిరాణి పిలుపునిచ్చారు. సోమవారం ఆమె మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సాయిరాణి మాట్లాడుతూ, మూడు రోజుల పాటు నిర్వహించే ఈ మహాసభల్లో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్తు పోరాట కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి యువత, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆమె కోరారు.