కాణిపాకం ఆలయ కొత్త వెబ్‌సైట్, వాట్సప్ సేవలు ప్రారంభం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: చిత్తూరు

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ నంబరు ద్వారా భక్తులు ఇకపై సులభంగా దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదాల టికెట్లు పొందవచ్చని ఆలయ ఈవో పెంచల కిశోర్, ఛైర్మన్ మణినాయుడు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ఈ నూతన డిజిటల్ సేవలను ప్రారంభిచినట్లు తెలిపారు.