పేదలందరికీ సొంతింటి కల నెరవేరుస్తూ ఎనిమిది లక్షల ఇందిరమ్మ ఇళ్లు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమమే ధ్యేయంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉచిత విద్యుత్, ఆర్టీసీ ప్రయాణంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. సొంతింటి కల నెరవేర్చేందుకు రెండు విడతల్లో ఎనిమిది లక్షల నలభై వేల ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా కేవలం పేదరికమే ప్రామాణికంగా ఇళ్లు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు.