ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల కలకలం: ఐసీఎంఆర్ మధ్యంతర నివేదిక వెల్లడి

రిపోర్టర్: అశోక్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలపై ఐసీఎంఆర్ చేపట్టిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. పరీక్షించిన వారిలో 24.35 శాతం మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు మధ్యంతర నివేదిక తేల్చింది. కవిటి మండలంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ నివేదికను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు నిపుణుల బృందం వివరించింది. పూర్తి స్థాయి పరిశీలన తర్వాత తుది నిర్ధారణకు రానున్నారు.