అమెరికా ఎన్నికలు: డొనాల్డ్ ట్రంప్ విమర్శలపై అబ్దుల్ ఎల్ సద్ కౌంటర్
రిపోర్టర్: సతీష్
స్థలం: మిషిగన్
అమెరికాలోని మిషిగన్ సెనేట్ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై డెమోక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్ సద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్రంప్ తన పేరు సరిగ్గా పలకలేరని ఎద్దేవా చేస్తూ, ఎన్నికల ఫలితాల తర్వాత తనను సెనేటర్‌గా పిలవాలని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, తాము ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేసేది లేదని అబ్దుల్ ఎల్ సద్ స్పష్టం చేశారు.