పులివెందులలో ఉద్రిక్తత: మీడియా ప్రతినిధులపై దాడి చేసి కెమెరా ధ్వంసం

రిపోర్టర్: రమేష్ స్థలం: పులివెందుల

పులివెందుల పురపాలక ఎన్నికల పోలింగ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అహోబిలపురంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణలను చిత్రీకరిస్తున్న ఇండియా టుడే ఛానల్ కెమెరామెన్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి కెమెరాను నేలకేసి కొట్టారని బాధితుడు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద కూడా ఎన్టీవీ మీడియా ప్రతినిధి సెల్ ఫోన్ ను కొందరు దుండగులు పగలగొట్టారు. ఈ దాడులను మీడియా ప్రతినిధుల సంఘం తీవ్రంగా ఖండించింది.