తెలంగాణలో క్రాప్ హాలిడేపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

ఏపీలో లేని క్రాప్ హాలిడే తెలంగాణలో ఎందుకు విధించాల్సి వస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా, గోదావరి నదుల నుంచే నీళ్లు వస్తున్నాయని గుర్తుచేశారు. కల్వకుర్తిలో అయిదు మోటర్లకు గాను కేవలం మూడు మోటర్లు మాత్రమే నడుపుతున్నారని, అది కూడా ఎనిమిది గంటలే ఇస్తున్నారని ఆరోపించారు. 24 గంటలు మోటర్లు నడిపిస్తే నాలుగు వేల క్యూసెక్కుల నీరు అందుతుందని స్పష్టం చేశారు.