పంతంగిలో ఉత్సాహంగా సాగిన గణేష్ లడ్డూ వేలం పాట
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లక్షా రెండు వేల ఆరు వందల పదహారు రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయన్ను అభినందించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.