ఎన్ఎఫ్ఎల్ లెజెండ్ బ్రెట్ ఫేవ్‌ను అరెస్ట్ చేయాలన్న టెరెల్ ఓవెన్స్
రిపోర్టర్: శివ
స్థలం: World
ఎన్ఎఫ్ఎల్ దిగ్గజం బ్రెట్ ఫేవ్‌పై మాజీ ప్లేయర్ టెరెల్ ఓవెన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధుల దుర్వినియోగం, మోసాలకు పాల్పడిన ఫేవ్‌ను వెంటనే అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు బ్రెట్ ఫేవ్ ప్రకటించగా, మరోవైపు ఆయనపై పాత ఆర్థిక కుంభకోణాల ఆరోపణలు మళ్లీ తెరపైకి రావడం క్రీడా వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమైంది.