రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదు

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

పార్టీ ఫిరాయింపుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తాను కాంగ్రెస్‌ను వీడేటట్లు చేసింది మీరేనని, రంగారెడ్డి జిల్లాలో రేవంత్ రెడ్డి భూములు ఎక్కడెక్కడ పోగు చేస్తున్నారో తమకు తెలుసని ఆరోపించారు. కేసీఆర్ క్యాబినెట్‌లో పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, కేసీఆర్‌తో కలిసి ఉద్యమంలో పాల్గొనలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉందన్నారు.