రైతు భరోసా అందాలంటే ఫార్మర్ ఐడీ తప్పనిసరి
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలోని రైతన్నలకు వ్యవసాయ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు రైతు భరోసా లాంటి ప్రభుత్వ పథకాల ఆర్థిక సాయం నిరంతరంగా అందాలంటే సెప్టెంబర్ 30వ తేదీలోగా ప్రతి రైతు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద ఫార్మర్ ఐడీని విధిగా రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్‌తో సమీపంలోని మీసేవా కేంద్రం లేదా వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు కోరారు.