భోపాల్ లో రిటైర్డ్ ఐఏఎస్ హత్య కేసు: ప్రధాన నిందితుడి అరెస్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Bhopal

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేష్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, కేర్ టేకర్ వరుణ్ కుమార్ ను ఆగ్రాలో అరెస్ట్ చేసినట్లు భోపాల్ పోలీసులు తెలిపారు. భోపాల్ కు తరలిస్తుండగా పోలీసులపై దాడికి యత్నించడంతో జరిగిన కాల్పుల్ లో నిందితుడికి గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ ముప్పైవ తేదీన సూరజ్ నగర్ లోని ఇంట్లోనే రాకేష్ అగర్వాల్ గొంతు కోసి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.