భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రత్యేక వాహనంపై సర్వత్రా ఆసక్తి

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్‌లో జరగనున్న 18వ BRICS సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకానున్నారు. ఈ పర్యటనలో ఆయన ఉపయోగించనున్న ప్రత్యేక బుల్లెట్‌ప్రూఫ్ కారు 'హాంగ్కీ N701' ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అమెరికా అధ్యక్షుడి 'ది బీస్ట్' కారుకు దీటుగా అత్యున్నత భద్రతా ప్రమాణాలు, ఆర్మర్ రక్షణతో ఈ అత్యాధునిక అధికారిక లిమోజిన్ వాహనాన్ని రూపొందించారు.