గుండె ఆరోగ్యానికి సాధారణ పరీక్షలే ప్రామాణికం కాదన్న వైద్యులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
సాధారణ ఆరోగ్య పరీక్షల్ లో రక్తపోటు, షుగర్ లెవెల్స్ సాధారణంగా ఉన్నప్పటికీ గుండె సురక్షితంగా ఉన్నట్లు కాదని మణిపాల్ ఆసుపత్రి కార్డియాలజీ నిపుణులు డాక్టర్ అబాద్ ఖాన్ స్పష్టం చేశారు. మెడికల్ రిపోర్ట్లు సాధారణంగా వచ్చినప్పటికీ గుండె జబ్బుల ముప్పు పొంచి ఉంటుందని ఆయన హెచ్చరించారు. జీవనశైలి మార్పులు, వంశపారంపర్య కారణాలు కూడా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, పూర్తి స్థాయి పరీక్షలు తప్పనిసరి అని వెల్లడించారు.