లోన్ యాప్ మోసాలపై విశాఖ పోలీస్ శాఖ కీలక హెచ్చరిక
రిపోర్టర్: గోపి
స్థలం: విశాఖపట్నం
లోన్ యాప్ మోసాల పట్ల విశాఖ నగర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని VizagCityPolice హెచ్చరించారు. ఫేక్ లోన్ యాప్స్, లింక్స్ మరియు అనుమానాస్పద కాల్స్ నమ్మవద్దని స్పష్టం చేశారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం లేదా వన్ టైమ్ పాస్వర్డ్ ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే ఒక తొమ్మిది ముప్పై సంఖ్యకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.